కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న తెలంగాణ ప్రభుత్వ సలహాదారు ఆర్. విద్యాసాగర్‌రావు మరణంతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆరోగ్యం క్షీణించడంతో కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందున్న విద్యాసాగర్‌రావును ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అంతలోనే ఆయన మరణ వార్త తెలియడంతో ముఖ్యమంత్రి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యాసాగర్‌రావు తెలంగాణలోని నీటి ప్రాజెక్టుల విషయంలో జరుగుతున్న మోసాన్ని గణాంకాలతో సహా వివరించి ప్రజలకు అవగాహన కల్పించినట్టు కేసీఆర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ సహా నీటి పారుదల రంగంలో చేయాల్సిన కార్యక్రమాల రూపకల్పనలో విద్యాసాగర్‌రావు అనుభవం ప్రభుత్వానికి ఎంతో ఉపయోగపడిందని కేసీఆర్ అన్నారు. జయశంకర్ తర్వాత తెలంగాణకు దక్కిన మరో మహానుభావుడు విద్యాసాగర్‌రావు అని కొనియాడారు. ఆయన కోసం చేసిన ప్రార్థనలు ఫలించి తిరిగి పూర్తి ఆరోగ్యంగా ఆస్పత్రి నుంచి బయటకు వస్తారని భావించామని, కానీ అంతలోనే విషాదం జరిగిపోయిందన్నారు. విద్యాసాగర్ రావు కుటుంబ సభ్యలుకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

No comments:
Post a Comment