ప్రపంచంలోనే అత్యంత బరువైన మహిళ ఎమాన్ అహ్మద్‌ను సొంత కుమార్తెలా చూసుకున్నానని ముంబై సైఫీ ఆసుపత్రి డాక్టర్ లక్డావాలా స్పష్టం చేశారు. 500 కేజీల బరువున్న ఎమాన్ అహ్మద్‌ను ఈజిప్ట్ నుంచి రప్పించి జాగ్రత్తగా చికిత్స చేసి 176 కేజీలకు తీసుకొచ్చామని, ఇదొక అద్భుతమని చెప్పారు. ఎమాన్ అహ్మద్ వచ్చిన కొత్తలో రాత్రంతా ఆమె రూంలో నిద్రపోయిన సంగతిని ఆయన గుర్తు చేశారు. మార్చి రెండున 500 కేజీల బరువున్న ఎమాన్ అహ్మద్ ప్రస్తుతం 378 కేజీల బరువును కోల్పోయిందని చెప్పారు.
అయితే తన సోదరి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లు చెబుతున్నదంతా కట్టుకథని ఎమాన్ అహ్మద్ సోదరి షైమా ఆరోపించారు. డాక్టర్ లక్డావాలాను టార్గెట్ చేస్తూ ఆయన్ను అబద్ధాలకోరు అని కూడా వ్యాఖ్యానించింది. ఎమాన్ అహ్మద్ తల్లి థానా అహ్మద్ కూడా డాక్టర్లపై విరుచుకుపడ్డారు. తమ కుమార్తెను పబ్లిసిటీ కోసం వాడుకున్నారని ఆరోపించారు. దీనిపై కలత చెందిన డాక్టర్లంతా తాము చికిత్స చేయబోమంటూ బాయ్‌కాట్ చేశారు. ఎమాన్ అహ్మద్ సోదరి, తల్లి చేస్తున్న ఆరోపణల్ని డాక్టర్ లక్డావాలా తోసిపుచ్చారు. ఆర్ధిక కారణాల వల్ల వారు ఎమాన్ అహ్మద్‌ను ఈజిప్ట్‌కు తీసుకెళ్లాలనుకోవడం లేదని చెప్పారు. అందుకే అనవసరంగా రభస సృష్టిస్తున్నారని డాక్టర్ లక్డావాలా ఆరోపించారు. మరోవైపు ఎమాన్ అహ్మద్‌ను అబుదాబీకి తరలించేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.

No comments:
Post a Comment